తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విదేశాంగ కార్యదర్శి నుంచి కేంద్రమంత్రిగా... - కేంద్ర మంత్రి వర్గం

విదేశాంగ కార్యదర్శిగా సేవలందించిన జై శంకర్​... నరేంద్రమోదీ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. రాష్ట్రపతి సమక్షంలో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దౌత్యవేత్తగా జై శంకర్​ అందించిన సేవలకుగాను ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.

జై శంకర్​ ప్రమాణ స్వీకారం

By

Published : May 30, 2019, 8:40 PM IST

జై శంకర్​ ప్రమాణ స్వీకారం

విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన 'సుబ్రహ్మణ్యం​ జై శంకర్'​... నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో చోటు సంపాదించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సమక్షంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

1977 బ్యాచ్​ ఐఎఫ్​ఎస్​ అధికారి అయిన జై శంకర్​... చెక్ రిపబ్లిక్​(2001-04), చైనా(2009-13), అమెరికా(2014-15) దేశాలకు భారత రాయబారిగా చేశారు. 2015 నుంచి 2018 వరకు విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.​ చైనాతో డోక్లాం వివాదం పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు. 2018లో ప్రభుత్వ బాధ్యతల నుంచి విరమణ అనంతరం 'టాటా సన్స్'​ అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవహారాల​ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశానికి విస్తృత సేవలందించిన జై శంకర్​ను ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.

జై శంకర్​ గురించి మరిన్ని వివరాలు...

జననం : 1955 జనవరి 9, దిల్లీ

తండ్రి : కె సుబ్రహ్మణ్యం

భార్య : క్యోకో జై శంకర్​

సంతానం : ఇద్దరు కుమారులు, కూతురు

చదువు : సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్​, జేఎన్​యూ, దిల్లీ

ఇదీ చూడండి : కేంద్రంలో కొలువుదీరిన మోదీ సర్కార్

ABOUT THE AUTHOR

...view details