తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభకు జైశంకర్​, జుగల్ ఠాకూర్​ ఎన్నిక

గుజరాత్ రాజ్యసభ ఉపఎన్నికల్లో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్, భాజపా నేత జుగల్ ఠాకూర్ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రాజ్యసభకు ఎన్నికైన జైశంకర్​, జుగల్ ఠాకూర్​

By

Published : Jul 6, 2019, 9:48 AM IST

గుజరాత్​ రాజ్యసభ ఉపఎన్నికల్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ విజయం సాధించారు. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో​ మరో భాజపా నేత జుగల్ ఠాకూర్ గెలిచారని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్​రూపానీ ప్రకటించారు. ఈ ఫలితాలను ఎన్నికల సంఘం ధ్రువీకరించింది. కానీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ ఉపఎన్నికల్లో అభ్యర్థులు గెలవడానికి 50 శాతం ఓట్లు (88 ఓట్లు) సాధించాలి. అయితే జైశంకర్ 104, ఠాకూర్​ 105 ఓట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులు చంద్రికా చూడాసామా, గౌరవ్​ పాండ్య ఒక్కొక్కరు 70 ఓట్లు చొప్పున ఓట్లు పొంది, ఓటమి చవిచూశారు.

కార్యదర్శి... మంత్రి... ఎంపీ...

విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జైశంకర్​ మోదీ 2.0 ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా నియమితులయ్యారు. అందువల్ల ఆరు నెలల్లోపు రాజ్యసభకుగానీ, లోక్​సభకుగానీ తప్పకుండా ఎన్నికవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన విజయం సాధించి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

గుజరాత్​ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన కేంద్రమంత్రులు అమిత్​షా, స్మృతి ఇరానీ గాంధీనగర్​, అమేఠీ నుంచి లోక్​సభకు ఎన్నికయ్యారు. ఈ కారణంతో వారిద్దరూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా ఉపఎన్నికలు జరిగాయి.

ఇదీ చూడండి: బడ్జెట్-19: జలశక్తి శాఖకు రూ.28,261 కోట్లు




ABOUT THE AUTHOR

...view details