రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే ముందు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే అలాంటివారిపై జైపుర్ పోలీసులు 'మసాకలి 2.0'ను ప్రయోగిస్తారట. అసలేంటి ఇది అనుకుంటున్నారా?
లాక్డౌన్ సమయంలో వీధుల్లో అనవసరంగా తిరిగే వారిని ఓ గదిలోకి తీసుకెళ్లి... ఇటీవల విడుదలైన 'మసాకలి 2.0' పాటను మళ్లీమళ్లీ వినిపిస్తామని జైపుర్ పోలీసులు ట్వీట్ చేశారు.
'మొండిగా ప్రవర్తించకండి, మూర్ఖంగా ఉండకండి, ఇంట్లోనే ఉండండి' అంటూ మొదలయ్యే ఈ పాటను ప్రస్తావిస్తూ లాక్డౌన్ వేళ అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని పోలీసులు కోరారు.
ఈ ట్వీట్‌కు భారీ స్పందన వస్తోంది. ఈ ఆలోచన ఎంతో బాగుందని, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఒరిజినల్ సాంగ్‌తో పోలిస్తే ఈ రీమేక్ పాట అంతగా ఆకట్టుకోలేదని సినీ తారలు, కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ పాట ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు ఉండటం వల్లే తీసుకున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ పాట ఒరిజినల్‌ను ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచారు.