తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహాత్ముని స్ఫూర్తితో 'జై జగత్'​ పాదయాత్ర

మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకొని గాంధేయవాదులు, సామాజిక కార్యకర్తలు దిల్లీ నుంచి జెనీవా వరకు పాదయాత్ర చేయనున్నారు. ఏడాది పాటు జరిగే ఈ పాదయాత్ర అక్టోబర్​ 2 నుంచి ప్రారంభమవుతుంది. మహాత్ముడు బోధించిన శాంతి, అహింసలే ఆదర్శంగా ఈ యాత్ర కొనసాగనుంది.

By

Published : Sep 25, 2019, 6:31 AM IST

Updated : Oct 1, 2019, 10:24 PM IST

మహాత్ముని స్ఫూర్తితో జై జగత్​ పాదయాత్ర

మహాత్మా గాంధీ బోధించిన శాంతి, అహింసయే ఆదర్శంగా ఏక్తా పరిషత్​... 'జై జగత్' పేరిట పాదయాత్ర ప్రారంభించాలని సంకల్పించింది. దిల్లీ నుంచి జెనీవా వరకు ఏడాది పాటు సాగే ఈ యాత్రలో గాంధేయవాదులు పాల్గొంటారు. మహాత్ముని జయంతి అక్టోబర్​ 2 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.

'జై జగత్'​ యాత్రలో కెనడా, ఫ్రాన్స్​, జర్మనీ, ఇరాన్​, సెనెగల్​, స్వీడన్​, బెల్జియం దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు పాల్గొంటాయని ఏక్తా పరిషత్ జాతీయ కన్వీనర్ అనీష్ తిల్లెంకరీ తెలిపారు.

ఏడాదిపాటు జరిగే ఈ యాత్రకు సామాజిక కార్యకర్త పీవీ రాజగోపాల్​, గాంధేయవాదంపై పరిశోధన చేసిన కెనడియన్​ నాయకుడు జిల్ కార్-హారిస్, ఎస్టీ, ఎస్సీ హక్కుల పోరాట నాయకుడు రమేశ్​ శర్మ సారథ్యం వహించనున్నారు.

ముందుగా ఈ బృందం 'జై జగత్'​ యాత్రను దిల్లీలో ప్రారంభించి మహారాష్ట్రలోని సేవాగ్రామ్​కు చేరుకుంటుంది. అక్కడ మహాత్ముడి ఆశ్రమాన్ని సందర్శించుకొని, నాగ్​పుర్​లో విమానయాన మార్గం ద్వారా ఇరాన్ వెళ్తారు. తర్వాత అక్కడి నుంచి అర్మేనియా వరకు యాత్ర కొనసాగుతుంది.

"కొన్ని రోజుల క్రితం గాంధీ సిద్ధాంతాలను తెలుసుకోవటం కోసం అర్మేనియా నుంచి ఓ వ్యక్తి భారత్​కి వచ్చాడు. తర్వాత ఇక్కడ నేర్చుకొన్న సిద్ధాంతాలను తన దేశంలో ప్రచారం చేశాడు. ఇప్పుడు అతను అర్మేనియా దేశానికి ప్రధాని అయ్యాడు. అతనే నికోల్ పశీన్యన్."
-తిల్లెన్‌కేరి, ఏక్తా పరిషత్ జాతీయ కన్వీనర్

పాక్​లోనూ శాంతియాత్ర

ముందుగా ఈ యాత్రను 2 నెలలపాటు పాకిస్థాన్​లోనూ చేపట్టాలని భావించారు. కానీ ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే... రాజ్​ఘాట్ నుంచి అట్టారీ- వాఘా సరిహద్దు వరకు, తర్వాత లాహోర్​ నుంచి ఇరాన్​ వరకు యాత్ర జరపాలని అనుకున్నారు. కానీ అట్టారీ- వాఘా సరిహద్దును మూసివేయటం వలన ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు.

'జై జగత్'​ యాత్ర వచ్చే ఏడాది సెప్టెంబర్​ 26న జెనీవా చేరుకుంటుంది. జెనీవాలోని 30 మున్సిపాలిటీ అధికారులు ఈ యాత్రకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తిల్లెన్‌కేరి తెలిపారు.

ఇదీ చూడండి:నీటి పొదుపు తక్షణావసరం: రాష్ట్రపతి

Last Updated : Oct 1, 2019, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details