తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రికెటర్​ రవీంద్ర జడేజా ఓటు భాజపాకే - రివాబ

భారత క్రికెటర్​ రవీంద్ర జడేజా ఇంట్లో నాటకీయ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జడ్డూ సతీమణి భాజపాలో.. అతని తండ్రి, సోదరి ఇప్పటికే కాంగ్రెస్​లో చేరారు. తాజాగా 'సర్​' జడ్డూ కాషాయ పార్టీకే తన మద్దతని ప్రకటించారు.

జడేజా మద్దతు భాజపాకే

By

Published : Apr 16, 2019, 5:53 PM IST

ప్రపంచకప్​లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్న జడ్డూ ఇంట్లో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇతని స్వస్థలం గుజరాత్​లోని జామ్​నగర్​. ఇప్పటికే జడేజా భార్య రివాబ భాజపాలో.. అతని తండ్రి, సోదరి హార్దిక్​ పటేల్​ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.

రవీంద్ర జడేజా తాజాగా ట్విట్టర్​లో భార్య రివాబ, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ట్యాగ్​ చేస్తూ భాజపాకే మద్దతు ఇస్తున్నట్లు ట్వీట్​ చేశారు. ఫలితంగా.. ఈ ఆల్​రౌండర్​ నిర్ణయం గుజరాత్​ లోక్​సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముంది. ఇక్కడ 26 లోక్​సభ స్థానాలకు మూడో విడతలో భాగంగా ఏప్రిల్​ 23న పోలింగ్​ జరగనుంది.

మార్చి 8న స్థానిక ఎంపీ పూనమ్​బెన్​ సమక్షంలో కాషాయపార్టీ తీర్థం పుచ్చుకున్నారు రివాబ. ఏప్రిల్​ 14నే జడేజా తండ్రి అనిరుధ్​ సింగ్​, సోదరి నైనాబా కాంగ్రెస్​లో చేరారు.

ఆల్​రౌండర్​ కోటాలో 'జడేజా' ప్రపంచకప్​నకు వెళ్లే భారత జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో​ చెన్నై సూపర్​కింగ్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇదీ చూడండి:రాజకీయాల్లో క్రీడాకారుల 'పవర్ ప్లే'

ABOUT THE AUTHOR

...view details