తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంకోర్టులో సీపీఎం 'హెబియస్ కార్పస్​' పిటిషన్​

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జమ్ము కశ్మీర్​లో నిర్బంధంలో ఉన్న సీపీఎం నేత మొహమ్మద్​ యూసఫ్​ తారిగామిని కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టులో సీపీఎం 'హెబియస్ కార్పస్​' పిటిషన్​

By

Published : Aug 24, 2019, 2:52 PM IST

Updated : Sep 28, 2019, 2:54 AM IST

జమ్ము కశ్మీర్​లో నిర్బంధంలో ఉన్న సీపీఎం నేత మొహమ్మద్​ యూసుఫ్​ తారిగామిని... న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని కోరుతూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో రిట్​ పిటిషన్​ వేశారు.

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్​లోని వివిధ పార్టీల నేతలను పోలీసులు నిర్బంధంలోనే ఉంచారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడైన తరిగామి... జమ్ము కశ్మీర్ అసెంబ్లీకి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను.. విడుదల చేయాలని, కోర్టు ముందు హాజరుపరచాలని (హెబియస్​ కార్పస్​) కోరుతూ ఏచూరి సుప్రీంను ఆశ్రయించారు.

తరిగామిని చూడడానికి ఈ నెల మొదట్లో ఏచూరి శ్రీనగర్​ బయలుదేరినప్పటికీ.... పోలీసులు ఆయనకు అవకాశం ఇవ్వలేదు.

ఇదీ చూడండి: ఆఖరి క్షణం వరకు కాషాయ సైనికుడిగానే సేవలు...

Last Updated : Sep 28, 2019, 2:54 AM IST

ABOUT THE AUTHOR

...view details