శ్రీనగర్ సచివాలయంపై ఇకనుంచి త్రివర్ణ పతాకం ఒక్కటే రెపరెపలాడనుంది. ఆదివారం జమ్ము కశ్మీర్ జెండాను తొలగించిన అధికారులు.. కేవలం జాతీయ జెండాను మాత్రమే ఆవిష్కరించారు. 370 ఆర్టికల్ రద్దయిన మూడు వారాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీనగర్ సచివాలయంపై జమ్ముకశ్మీర్ జెండా తొలగింపు - రాష్ట్రం
శ్రీనగర్ సచివాలయంపై ఆదివారం జమ్ముకశ్మీర్ రాష్ట్ర జెండాను తొలగించి.. కేవలం జతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అధికారులు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని ఎగరవేస్తామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దయిన మూడు వారాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
![శ్రీనగర్ సచివాలయంపై జమ్ముకశ్మీర్ జెండా తొలగింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4238951-771-4238951-1566748366262.jpg)
శ్రీనగర్ సచివాలయంపై జమ్ముకశ్మీర్ జెండా తొలగింపు
ఆర్టికల్ 370 రద్దు ముందు వరకు జమ్ము కశ్మీర్లో అధికారికంగా జాతీయ జెండాతో పాటు రాష్ట్రీయ జెండానూ ఎగరేసేవారు. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి రద్దుతో తాజాగా ఆ జెండాను తొలగించారు. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కేవలం జాతీయ పతాకాన్నే ఎగరవేస్తామని అధికారులు వెల్లడించారు.
Last Updated : Sep 28, 2019, 6:19 AM IST