తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్ జనాభా లెక్కింపునకు సమన్వయ కమిటీ - JK

జమ్ముకశ్మీర్​లో 2021 సంవత్సరానికి జనాభా లెక్కింపునకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది సాధారణ పరిపాలనా విభాగం(జీఏడీ​). కశ్మీర్​ ప్రభుత్వ పధాన కార్యదర్శి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు.

కశ్మీర్ జనాభా లెక్కించేందుకు సమన్వయ కమిటీ

By

Published : Sep 4, 2019, 5:36 PM IST

Updated : Sep 29, 2019, 10:39 AM IST

కశ్మీర్ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ప్యానెల్​ను ఏర్పాటు చేసింది సాధారణ పరిపాలనా విభాగం(జీఏడీ). 2021లో జరగబోయే జనాభా లెక్కింపునకు సమన్వయ కమిటీగా వ్యవహరించనుంది ఈ ప్యానెల్​.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు కశ్మీర్​ జీఏడీ ఉప ప్రధాన కార్యదర్శి గిరిధరి లాల్.

2011 అధికారిక గణాంకాల ప్రకారం జమ్ముకశ్మీర్ జనాభా 1,25,41,302. ఇందులో 66,40,662 మంది పురుషులు. 59,00,640 మంది మహిళలు. పురుషులు, మహిళల నిష్పత్తి 1000:889గా ఉంది. కశ్మీర్​లో అక్షరాస్యత 67.16 శాతం. పురుషుల్లో 76.75శాతం మంది అక్షరాస్యులు. మహిళల అక్షరాస్యత శాతం 56.43.

ఇదీ చూడండి: దావూద్​, మసూద్​లను ఉగ్రవాదులుగా ప్రకటించిన హోంశాఖ

Last Updated : Sep 29, 2019, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details