జమ్ముకశ్మీర్‌లోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో కొత్తగా 127 ఉద్యోగులను నియమించేందుకు ఆ రాష్ట్ర పాలకమండలి అంగీకారం తెలిపింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇందులో 50 సీనియర్ ఎలక్షన్ అసిస్టెంట్, 77 జూనియర్ ఎలక్షన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
జమ్ముకశ్మీర్‌లో 127 ఎలక్షన్ అసిస్టెంట్ పోస్టులు!
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్‌లో ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా అక్కడి ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కొత్తగా 127 ఉద్యోగాల విడుదులకు సిద్ధమైంది.
జమ్ముకశ్మీర్‌లో 127 ఎలక్షన్ అసిస్టెంట్ పోస్టులు!
ఈ కొత్త ఉద్యోగాల ద్వారా ఎరోనెట్, బ్లోనెట్తో పాటు భారత ఎన్నికల సంఘం ప్రారంభించే పలు కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయనున్నారు. అలాగే జమ్ముకశ్మీర్‌లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు జాబితా నుంచి నకిలీ ఓటర్ల తొలగింపు వంటి సేవలు అందించేందుకు ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు.
Last Updated : Sep 30, 2019, 10:06 PM IST