అయోధ్య తీర్పు అనంతరం కశ్మీర్లో పరిస్థితులపై సమీక్షించడానికి ఆర్మీ నార్తన్ కమాండర్ జనరల్ రన్బీర్ సింగ్తో భేటీ అయ్యారు జమ్ము కశ్మీర్ డీజీపీ డిల్బగ్ సింగ్. కశ్మీర్ వ్యాప్తంగా భద్రతపై ఇరువురు చర్చించారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో.. ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున భద్రత బలగాలను మోహరించిన అధికారులు.. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్షించారు.
అనంతరం రాంబన్ను సందర్శించిన డిల్బగ్... జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని పరిశీలించారు. రాంబన్ సీనియర్ సూపరింటెండెంట్ అధికారి అనిత శర్మ, జాతీయ రహదారుల అధికారి జోహర్లతో సమావేశమయ్యారు. ఆర్టికల్-370 రద్దు, అయోధ్య తీర్పు తదనంతరం కశ్మీర్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రహదారులను త్వరితగతిన బాగు చేయాలని అధికారులకు సూచించారు.