తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​ ప్రత్యేక హోదా కాపాడేందుకు ఉమ్మడి పోరాటం' - farooq abdulla'

జమ్ముకశ్మీర్​లో తాజా పరిణామాలపై ఆ రాష్ట్రంలోని అఖిలపక్షాలు  సమావేశమయ్యాయి. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నియమాల రద్దు, రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించాలనే ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలిసి పోరాడాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి.

'కశ్మీర్​ ప్రత్యేక హోదా కాపాడేందుకు ఉమ్మడి పోరాటం'

By

Published : Aug 4, 2019, 11:04 PM IST

జమ్ముకశ్మీర్​కు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించాలనే వంటి అంశాలపై ఉమ్మడిగా పోరాడాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి ఆ రాష్ట్ర అఖిలపక్ష పార్టీలు. నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఓమర్​ అబ్దుల్లా నివాసంలో ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు నేతలు. కశ్మీర్​లో ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు ఎన్​సీ అధినేత ఫరూక్​ అబ్దుల్లా. రాజ్యాంగంలోని అధికరణ 370, అధికరణ 35ఏలను రద్దు చేయాలనే ప్రయత్నాలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

'కశ్మీర్​ ప్రత్యేక హోదా కాపాడేందుకు ఉమ్మడి పోరాటం'

" జమ్ముకశ్మీర్​, లద్ధాఖ్​ గుర్తింపు, స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక ప్రతిపత్తికి ఏ విధమైన భంగం కలగకుండా అన్ని పార్టీలు కలిసి ఐక్యంగా నిలవాలని అఖిలపక్షం తీర్మానించింది. అధికరణ 35ఏ, అధికరణ 370 తొలగింపు సహా రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయడం వంటి చర్యలు జమ్ముకశ్మీర్​, లద్ధాఖ్​ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకం. జమ్ముకశ్మీర్​ విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించాల్సిందిగా రాష్ట్రపతిని, ప్రధానిని కోరుతున్నాం."

- ఫరూఖ్​ అబ్దుల్లా, ఎన్​సీ అధినేత.

భారత్​, పాకిస్థాన్​లు జమ్ముకశ్మీర్​ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అన్ని పార్టీలు కోరుతున్నాయన్నారు అబ్దుల్లా. కాదని ముందుకెళితే.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయన్నారు. రాష్ట్ర ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు.

అఖిలపక్ష సమావేశానికి పీడీపీ అధినేత్రి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఎన్​సీ నేత ఓమర్​ అబ్దుల్లా, కాంగ్రెస్​ నాయకుడు తాజ్​ మొహియుద్దీన్​, పీడీపీ నేత ముజఫర్​ బేగ్​, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకులు సజద్​ లోన్​, ఇమ్రాన్​ అన్సారి, జేకే పీపుల్స్​ మువ్​మెంట్​ నేత షా పైజల్​, సీపీఎం నుంచి తరిగామి హాజరయ్యారు.

ఇదీ చూడండి: కశ్మీర్​పై పాక్ ప్రధాని ఇమ్రాన్​ కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details