ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. షేర్-ఏ-కశ్మీర్ స్టేడియంలో జరిగే జెండావందన కార్యక్రమంలో పాల్గొనున్నారు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
గ్రామగ్రామాన జెండా పండుగ
కశ్మీర్ లోయలోని ప్రతి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించాలని, ప్రతి సర్పంచ్ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అదేశాలు జారీ చేయాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించారు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్. ప్రతి జిల్లాలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు గవర్నర్.