జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడిగించింది ప్రభుత్వం. ప్రజా భద్రత చట్టం కింద ఆమెకు విధించిన నిర్బంధ గడువు ఆగస్టు 5న ముగుస్తుండటం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకుంది జమ్ముకశ్మీర్ పరిపాలనా విభాగం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం పొడిగింపు - pdp president news
పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధాన్ని మరో 3 నెలలు పొడిగించింది జమ్ముకశ్మీర్ పరిపాలనా విభాగం. ఆగస్టు 5తో ఆమె నిర్బంధం ముగుస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు వందలాది మంది రాజకీయ నేతలను ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధించింది ప్రభుత్వం.
![మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం పొడిగింపు J-K admin extends detention of Mehbooba Mufti by 3 months under PSA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8245774-805-8245774-1596193971549.jpg)
మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం మరో 3 నెలలు పొడిగింపు
ఆర్టికల్ 370 రద్దుకు ముందు శాంతిభద్రతల దృష్ట్యా జమ్ముకశ్మీర్‌లోని వందలాది మంది రాజకీయ నేతలకు నిర్బంధం విధించింది ప్రభుత్వం. ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా కొన్ని నెలల నిర్బంధం అనంతరం విడుదలయ్యారు.