తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఎన్​కౌంటర్​లో హతమైన ఇద్దరికి కరోనా​ - కరోనా వైరస్​

జమ్ముకశ్మీర్​ కుల్గాంలో భద్రతా బలగాలు హతమార్చిన ఇద్దరు ముష్కరులకు కరోనా పాజిటివ్​గా తేలినట్టు అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం ముష్కరుల మృతదేహాలను ఖననం చేయనున్నట్టు స్పష్టం చేశారు.

J-K: 2 Hizbul terrorists killed in Kulgam encounter test positive for COVID-19
ఆ ఇద్దరు ముష్కరులకు కరోనా పాజిటివ్​

By

Published : Jul 5, 2020, 5:57 PM IST

జమ్ముకశ్మీర్​ కుల్గాంలో శనివారం జరిగినఎన్​కౌంటర్​లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన ఇద్దరు హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్రవాదులకు కరోనా వైరస్​ సోకినట్టు అధికారులు వెల్లడించారు.

"మరణించిన ఉగ్రవాదుల రక్త నమూనాలను సేకరించి.. కరోనా పరీక్షల కోసం శ్రీనగర్​లోని సీడీ ఆసుపత్రికి శనివారమే పంపించాం. ఆదివారం నివేదిక అందింది. మృతిచెందిన ఇద్దరు ముష్కరులకు కరోనా పాజిటివ్​గా తేలింది."

-- పోలీసు శాఖ ప్రతినిధి.

బారాముల్లాలో.. ఉగ్రవాదుల మృతదేహాలను నిబంధనల ప్రకారం ఖననం చేయనున్నట్టు ఆ పోలీసు అధికారి తెలిపారు.

ఇద్దరు హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్రవాదుల్లో ఓ వ్యక్తి విదేశీయుడని.. అతడి పేరు అలీ భాయ్​ అని పోలీసులు వెల్లడించారు. రెండో ముష్కరుడి వివరాలు ఇంకా తెలియలేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-దూబే డెన్​పై​ దాడి సమాచారం పోలీసుల నుంచే లీక్

ABOUT THE AUTHOR

...view details