జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి సమావేశంలో పునరుద్ఘాటించారు. మంగళవారం జరిగిన సదస్సులో కశ్మీర్ అంశంలో పాక్ జోక్యాన్ని తీవ్రంగా ఆక్షేపించారు స్వరూప్. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రబిందువుగా మారిందని విమర్శించారు. స్విట్జర్‌లాండ్‌లో జరుగుతున్న 43వ మానవ హక్కుల మండలి సమావేశంలో ప్రసంగించిన ఆయన... ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆర్థిక ఊతం అందిస్తున్న దేశాలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చారు.
పాక్‌కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
భారత్‌లో కశ్మీర్ ఎప్పటికీ అంతర్భాగమేనని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి సమావేశంలో విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ తేల్చిచెప్పారు. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ జోక్యాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
'జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే'
కశ్మీరీ ప్రజల మానవ హక్కులను భారత్ హరిస్తోందన్న పాక్ మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఎండగట్టారు వికాస్. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని పాక్ చూస్తోందని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370 రద్దు భారత్ అంతర్గత అంశమన్నారు. కశ్మీర్ భారత్‌లో భాగమనే వాస్తవాన్ని పాక్ అంగీకరించాలని హితవు పలికారు. భారత్‌పై వ్యతిరేక ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు.
Last Updated : Mar 2, 2020, 4:12 PM IST