జమ్ముకశ్మీర్ శ్రీనగర్ జిల్లాలో ఉగ్రమూకలు చేసిన గ్రెనేడ్ దాడిలో ఓ వీధి శునకం ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని నూర్బాఘ్ ప్రాంతంలో భద్రత దళాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి చేశారు.
" ఉదయం 6.30 గంటల ప్రాతంలో గుర్తు తెలియని ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్కు చెందిన 161 బెటాలియన్ బంకర్‌పై గ్రెనేడ్ దాడికి పాల్పడగా.. అది రోడ్డుపై పడి పేలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఓ వీధి శునకం తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది."