తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదుల హతం - 4 terrorists have been killed in the encounter

J&K: Encounter breaks out between security forces
కశ్మీర్​లో 2 ఎన్​కౌంటర్లు​- నలుగురు ఉగ్రవాదులు హతం

By

Published : Apr 27, 2020, 9:18 AM IST

Updated : Apr 27, 2020, 11:12 AM IST

11:11 April 27

ముగ్గురు హతం

జమ్ము కశ్మీర్​లో కుల్గాం జిల్లా లోయర్​ ముందాలో​ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఈ మేరకు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. భారత సైన్యం, సీఆర్​పీఎఫ్​, పోలీసులు సంయుక్తంగా తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

09:52 April 27

జమ్ము కశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.  కుల్గాం జిల్లా లోయర్​ ముందాలో​ ముష్కరులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు భారత సైన్యం, సీఆర్​పీఎఫ్​, పోలీసులు సంయుక్తంగా నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ముందే పసిగట్టిన ఉగ్రవాదులు.. సిబ్బందిపై కాల్పులు జరపగా ఎన్​కౌంటర్​కు దారితీసింది. బలగాల చేతికి ముగ్గురు ముష్కరులు చిక్కినట్లు సమాచారం.  

ప్రస్తుతం ఇరువర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్ర దాడిని భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.  

అంతకుముందు.. కుల్గాంలోని గుడ్డెర్​ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. 

09:19 April 27

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో 2 వేర్వేరు చోట్ల ఉగ్ర కలకలం రేగింది. ఇప్పటివరకు నలుగురు ముష్కరులు హతమయ్యారు. మరో ముగ్గురిని భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు.

గుడ్డెర్ ప్రాంతంలో...

గుడ్డెర్ ప్రాంతం అస్థల్ గ్రామంలో గత రాత్రి గస్తీ విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బందిపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది దీటుగా స్పందించారు. నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. వారు ఏ ఉగ్రసంస్థకు చెందినవారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

లోయర్​ముందా ప్రాంతంలో...

లోయర్​ముందా ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు. ప్రస్తుతం ఇంకా రెండు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు కొనసాగుతున్నాయి. 

09:16 April 27

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. కుల్గాంలోని గుడ్డెర్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

Last Updated : Apr 27, 2020, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details