ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర ఆంక్షల నడుమ జరుగనుంది. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా రోజుకు 500 మందిని మాత్రమే మహా శివుడికి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పించనునట్లు జమ్ముకశ్మీర్ పాలన యంత్రాంగం తెలిపింది.
అమర్‌నాథ్ యాత్ర జూన్ 23న ప్రారంభమై 42 రోజుల పాటు జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తితో ఆలస్యమైంది. ఈ క్రమంలోనే యాత్ర జులై చివరి వారంలో ప్రారంభమై 15 రోజులే జరుగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు అమర్‌నాథ్ దేవాలయ బోర్డు అధికారులు వెల్లడించారు.