తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌరసత్వ బిల్లుపై సుప్రీంలో రిట్​ పిటిషన్​

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై సుప్రీం కోర్టులో రిట్​ పిటిషన్​ దాఖలు చేసింది ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్​)​. బిల్లు.. రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని అభ్యర్థించింది.

IUML
ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్

By

Published : Dec 12, 2019, 11:33 AM IST

వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లు-2019కు పార్లమెంట్​ ఆమోదం పొందిన నేపథ్యంలో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. పార్లమెంటు ఆమోదం లభించిన మరుసటి రోజునే బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్​ (ఐయూఎంఎల్​). అత్యున్నత న్యాయస్థానంలో రిట్​ పిటిషన్​ దాఖలు చేసింది.

పౌరసత్వ బిల్లు అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరింది ఐయూఎంఎల్​. భారత రాజ్యాంగం కల్పించే సమానత్వ హక్కులను ఈ బిల్లు హరిస్తుందని పిటిషన్​లో పేర్కొంది​.

ఐయూఎంఎల్​ తరఫున కపిల్​ సిబల్​..

ఈ రిట్​ పిటిషన్​పై వాదనలు వినిపించేందుకు సీనియర్​ న్యాయవాది కపిల్​ సిబల్​ అంగీకరించారు. ఐయూఎంఎల్​ తరఫున బిల్లుకు వ్యతిరేకంగా వాదించనున్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ఇదీ చూడండి: పంతం నెగ్గించుకున్న కేంద్రం- 'పౌర' బిల్లుకు పార్లమెంటు ఆమోదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details