కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బందిని అసంతృప్తికి గురిచేయవద్దని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా యుద్ధం చేస్తున్న వైద్యులకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. కొంత మంది వైద్యులకు వేతనాలు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.
సమస్యను పరిష్కరించండి
వైద్యుల వేతనాలు చెల్లించకుండా నిలిపివేసిన అంశంపై న్యాయస్థానాలు కలుగజేసుకోకూడదని జస్టిస్ ఆశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల వేతనాల చెల్లింపు సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి సూచించింది. ఈ విషయంలో పిటిషనర్ల సలహాలు, సూచనలను పరిశీలించాలని కేంద్ర ఆరోగ్యశాఖను ఆదేశించింది.