తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రక్తంలోని ఆక్సిజన్​ స్థాయిపైనా కరోనా ప్రభావం'

కరోనా వ్యాప్తి​ నేపథ్యంలో అమెరికా ఇల్లినాయీ​ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్​ విజయ్​ వీ యాదవెందు 'ఈటీవీ భారత్'​కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రక్తంలోని ఆక్సిజన్​ స్థాయిపైనా వైరస్​ ప్రభావం చూపిస్తోందని.. దీని వల్ల బాధితులు ఒక్కసారిగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల ఆక్సిజన్​ స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.

Its advisable to monitor oxygen level frequently, says Epidemiologist
'రక్తంలోని ఆక్సిజన్​ స్థాయిపైనా కరోనా ప్రభావం'

By

Published : Jul 27, 2020, 6:08 PM IST

కరోనా వైరస్​ రక్తంలోని ఆక్సిజన్​ స్థాయిపైనా ప్రభావం చూపిస్తోందని అమెరికా షికాగోలోని ఇల్లినాయీ​ విశ్వవిద్యాలయ ఎపిడమాలజిస్ట్​ విజయ్​ వీ యాదవెందు తెలిపారు. అందువల్ల శరీరంలోని ఆక్సిజన్​ స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం శ్రేయస్కరమని 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.

"ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​.. రక్తంలోని ప్రాణవాయువు స్థాయిపైనా ప్రభావం చూపుతోంది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఆక్సిజన్​ స్థాయి అకస్మాత్తుగా పడిపోతే.. ఆ వ్యక్తి కుప్పకూలే ప్రమాదం ఉంది. రక్తం గడ్డకట్టుకుపోతుంది. దీని వల్ల ఇంకా ప్రమాదముంది."

--- విజయ్​​ యాదవెందు, ఎపిడమాలజిస్ట్​.

వైరస్​ బాధితుల్లో ఆక్సిజన్​ స్థాయి అనూహ్యంగా పడిపోతున్న విషయాన్ని బ్రిటన్​ వైద్యులు గుర్తించారని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణవాయువును అందించడం సహా డిక్సామెథసోన్​ అనే స్టెరాయిడ్​ను ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తున్నట్టు వారు నిర్ధరించారని విజయ్​ వెల్లడించారు. అయితే స్టెరాయిడ్​ వాడకంతో సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయన్నారు.

భారత్​తో పోల్చుకుంటే అమెరికాకు భారీ స్థాయిలో వైరస్​ ప్రవేశించిందని చెప్పారు విజయ్​. దాని తీవ్రతను గుర్తించే సరికే ఆలస్యమైందని, అందుకే అగ్రరాజ్యం అధికంగా నష్టపోయిందని వివరించారు. అయితే భారత్​లో కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఇతర దేశాలతో పోల్చుకుంటే వైరస్​ వ్యాప్తి నియంత్రణ చర్యలు మెరుగ్గానే ఉన్నాయన్నారు విజయ్​. అదే విధంగా.. ఇతర దేశాల ప్రజలతో భారతీయుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువని.. ఈ విషయమే వైరస్​ను వారిని రక్షిస్తోందని చెప్పారు.

ఇదీ చూడండి:-కరోనా వేళ జిమ్​లు ఎంత సురక్షితం?

ABOUT THE AUTHOR

...view details