తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనా సరిహద్దులకు 6వేల ఐటీబీపీ బలగాలు - భారత చైనా కాల్పులు

చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఐటీబీపీ బలగాలను భారీగా తరలిస్తోంది భారత్. చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు నిరంతరం నిఘా కోసం వీరిని ఉపయోగించనుంది. అయితే దేశంలో అంతర్గత శాంతి భద్రత విధులను ఐటీబీపీకి కేటాయించే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

SINOINDIA ITBP
ఐటీబీపీ బలగాలు

By

Published : Jul 8, 2020, 6:45 AM IST

చైనాతో ఉద్రిక్తతల నడుమ సరిహద్దుల వద్ద భారత్​ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను భారీగా మోహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి చెందిన 60 కంపెనీలను భారత్​ తరలిస్తోంది. చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు నిరంతరం నిఘా కోసం వీరిని ఉపయోగించనుంది.

ఇప్పటికే 40 కంపెనీల ఐటీబీపీ సిబ్బంది సరిహద్దు క్యాంపుల్లో చేరారు. ఒక్కో కంపెనీలో 100 మంది ఉంటారు. కరోనా నేపథ్యంలో వీరిని ప్రస్తుతం క్వారంటైన్​లో ఉంచినట్లు తెలుస్తోంది. మరో 9 బెటాలియన్లనూ తరలించేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

అంతర్గత భద్రత..?

చైనాతో సరిహద్దు వెంబడి లద్దాఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్​ప్రదేశ్​లో ఈ బలగాలు సేవలందించనున్నాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే సమీప భవిష్యత్తులో అంతర్గత భద్రతకు సంబంధించి ఐటీబీపీకి ఎలాంటి బాధ్యతలను కేటాయించరని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫలితంగా దేశంలో అంతర్గతంగా శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులకు సహాయకంగా వీరిని నియమించే అవకాశం లేదని తెలుస్తోంది. బిహార్​లో జరగబోయే ఎన్నికలు, వివిధ పండగల నేపథ్యంలో జరిగే ఉత్సవాలకు వీరు సేవలు అందించటం కష్టమేనని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఐటీబీపీకి చెందిన 34 బెటాలియన్లు చైనా సరిహద్దు వెంబడి 180 స్థావరాల్లో సేవలు అందిస్తున్నాయి.

ఇదీ చూడండి:నేపాల్ రాజకీయాల్లో చైనా జోక్యం.. ఓలి కోసమే!

ABOUT THE AUTHOR

...view details