ఉత్తరాఖండ్ పితోర్‌గఢ్ జిల్లా మారుమూల గ్రామం లాప్సాలో గాయపడ్డ ఓ మహిళను ఆస్పత్రికి తరలించేందుకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్లు తీవ్రంగా శ్రమించారు. స్ట్రెచర్‌పై ఆమెను మోసుకుంటూ 40 కిలోమీటర్ల దూరం కాలినడకన పయనించారు.
ప్రాణానికి ప్రాణం అడ్డేసిన జవాన్లు- సలాం చేసిన కొండకోనలు - jawan carrying a lady on strecher in uttarakhandvideo
ఉత్తరాఖండ్‌లో ప్రాణాలు పణంగా పెట్టి ఓ మహిళను ఆసుపత్రికి తరలించారు ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు. ఎత్తైన కొండ ప్రాంతంలో 40 కిలోమీటర్ల మేర రాళ్లు రప్పలు, సెలయేర్లు దాటి 15 గంటలపాటు ఆమెను మోశారు జవాన్లు. జవాన్ల సాహసానికి స్థానికులు సలాం చేశారు.
ప్రాణానికి ప్రాణం అడ్డేసిన జవాన్లు-సలాం చేసిన కొండకోనలు!
కొండలు, వరద ప్రభావిత ప్రాంతాల మీదుగా 15 గంటల పాటు వారి ప్రయాణం సాగింది. లాప్సా నుంచి మున్సియారి వరకు ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ వారు పయనించారు. జవాన్ల సేవానిరతిని స్థానికులు కొనియాడారు.
ఇదీ చదవండి: గంజాయిపై నిషేధంతో భారత్‌కు వేల కోట్లు నష్టం!