తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా నుంచి కోలుకొని గుండెపోటుతో వ్యక్తి మృతి

ఇటలీ నుంచి భారత్​కు వచ్చిన ఓ పర్యాటకుడు జైపూర్​లో మృతి చెందారు. ఇటీవల ఆ వ్యక్తి కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ.. గుండెపోటు రావడం వల్ల మరణించాడని ధ్రువీకరించారు వైద్యులు.

Italian tourist dies in Jaipur hospital
కరోనా నుంచి కోలుకొని గుండెపోటుతో వ్యక్తి మృతి

By

Published : Mar 20, 2020, 1:57 PM IST

కరోనా బారిన పడి కోలుకున్న ఓ ఇటలీవాసి రాజస్థాన్​లో మృతిచెందారు. ఆయన మృతికి కరోనా కారణం కాదని జైపూర్​ ఎస్ఎమ్​ఎస్​ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు.

ఇటలీ నుంచి వచ్చిన 69 ఏళ్ల పర్యాటకుడు.. కరోనా బారిన పడి ఇటీవలే ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులు చికిత్స పొందారు. తర్వాత ఆయన పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. గురువారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల ఆ వ్యక్తి మృతిచెందారని ఎస్​ఎమ్​ఎస్​ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్​ సుధీర్​ భండారి తెలిపారు. వైరస్​ సోకక ముందు నుంచే ఆయనకు గుండె, కాలేయ సంబంధిత వ్యాధులున్నాయి.

దేశంలో 206కు చేరిన కేసులు

దేశంలో ఇప్పటివరకు 206 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయినట్లు ఇండియన్​ కౌన్సిల్ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్​ ప్రకటించింది. మొత్తం 13,486 మంది నుంచి 14,376 నమూనాలను పరీక్షించినట్లు తెలిపారు.

అందుబాటులో వాట్సాప్​ నంబరు

ప్రస్తుతం కరోనా దేశంలో విజృంభిస్తున్నందున అత్యవసర సాయం, వైరస్​కు సంబంధించిన సమాచారం కోసం ఓ వాట్సాప్​ హెల్ప్​లైన్ నంబరును విడుదల చేసింది ప్రభుత్వం. "మైగవ్​ కరోనా హెల్ప్​డెస్క్"​ పేరిట +91 90131 51515 నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇదీ చదవండి:మాస్క్​ లేకుండా తుమ్మినందుకు దేహశుద్ధి!

ABOUT THE AUTHOR

...view details