తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చౌకీదార్​ దొంగో కాదో ప్రజలే నిర్ణయిస్తారు' - CHOWKIDAR

'కమలం బ్రాండ్​ చౌకీదార్​' దొంగో కాదో ప్రజాకోర్టులోనే తేలుతుందని అన్నారు రాహుల్​ గాంధీ. సార్వత్రిక ఎన్నికల ఫలితం వెలువడే మే 23 ఇందుకు ముహూర్తమని ట్వీట్​ చేశారు.

'చౌకీదార్​ దొంగో కాదో ప్రజలే నిర్ణయిస్తారు'

By

Published : Apr 22, 2019, 5:09 PM IST

Updated : Apr 22, 2019, 7:58 PM IST

'చౌకీదార్​ దొంగో కాదో ప్రజలే నిర్ణయిస్తారు'

'చౌకీదార్​ చోర్​ హై' వివాదంపై సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసిన కాసేపటికే ప్రధానిపై మరోమారు అదే విమర్శ చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. కమలం బ్రాండ్​ చౌకీదార్​ నిజమైన దొంగని మే 23న ప్రజలే నిర్ణయిస్తారని ట్వీట్​ చేశారు. ఈ పోస్ట్​కు 'చౌకీదార్​ చోర్​ హై' హ్యాష్​ ట్యాగ్​నూ జతచేశారు​.

"కమలం బ్రాండ్​ చౌకీదారే నిజమైన దొంగని మే 23న ప్రజలే నిర్ణయిస్తారు. న్యాయం జరుగుతుంది. పేదల నుంచి దోచుకుని తన ధనిక స్నేహితులకు లాభం చేకూర్చిన చౌకీదార్​కు శిక్షపడుతుంది."
- రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

కోర్టు ధిక్కరణ నోటీసు​పై నేడు సుప్రీం కోర్టులో అఫిడవిట్​ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను చేసిన వ్యాఖ్యలను రఫేల్​ తీర్పుతో ముడిపెట్టడంపై విచారం వ్యక్తం చేశారు​. కోర్టు గౌరవాన్ని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

Last Updated : Apr 22, 2019, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details