తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎప్పటికీ ఎన్సీపీలోనే ఉంటా.. అజిత్ పవార్ యూటర్న్'​ - news on maharastra politics

దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంపై స్పందించారు ఎన్సీపీ నేత అజిత్​ పవార్​. తాను చేసింది తిరుగుబాటు కాదని స్పష్టం చేశారు. తానెప్పుడూ ఎన్సీపీ నాయకుడినేనని, ఎన్సీపీలోనే ఉన్నానని ఉద్ఘాటించారు.

Ajit Pawar
'ఎప్పటికీ ఎన్సీపీలోనే ఉంటా.. అజిత్ పవార్ యూటర్న్'​

By

Published : Nov 27, 2019, 7:48 PM IST

ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు మద్దతు ఇవ్వటం తిరుగుబాటు కాదని స్పష్టం చేశారు ఎన్సీపీ నేత అజిత్​ పవార్​. తాను ఎన్సీపీలోనే కొనసాగుతానని వెల్లడించారు. పార్టీ అధినేత శరద్​ పవార్​ ఆదేశాల అనుసారం నడుచుకోనున్నట్లు తెలిపారు.

" ఇది తిరుగుబాటు కాదు. నేను ఎన్సీపీ నాయకుడిని. నన్ను పార్టీ తొలగించిందా? మీరు ఎక్కడైన చదివారా? నేను ఎన్సీపీలోనే ఉన్నానని చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పటికీ, ఎప్పటికీ.. నేను ఎన్సీపీలోనే ఉంటాను."

- అజిత్​ పవార్​, ఎన్సీపీ నేత

దేవేంద్ర ఫడణవీస్​ నేతృత్వంలో శనివారం ఏర్పడిన భాజపా ప్రభుత్వానికి మద్దతు పలికారు అజిత్​ పవార్​. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ.. నాలుగు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేసి మద్దతు ఉపసంహరించుకున్నారు.

ఇదీ చూడండి:రేపే ఠాక్రే ప్రమాణం.. అతిరథమహారథులకు ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details