తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉపఎన్నికలకు ముందు విపక్ష నేత ఇంటిపై ఐటీ దాడులు - కర్ణాటక ఉపఎన్నికల వేళ విపక్ష పార్టీ నేతలపై ఐటీ దాడులు

కర్ణాటక రాణెబెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కోలివాద్​ నివాసంపై నిన్న ఐటీ, ఎక్సైజ్​ అధికారులు దాడులు చేశారు. కర్ణాటక ఉపఎన్నికలకు ముందు విపక్షపార్టీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరగడం రాజకీయ దుమారం రేపుతోంది.

IT raids at residence of Congress candidate for Ranebennur seat in Karnataka
ఉపఎన్నికలకు ముందు విపక్ష నేత ఇంటిపై ఐటీ దాడులు

By

Published : Dec 4, 2019, 12:06 PM IST

Updated : Dec 4, 2019, 1:02 PM IST

ఉపఎన్నికలకు ముందు విపక్ష నేత ఇంటిపై ఐటీ దాడులు

కర్ణాటక ఉపఎన్నికలకు ముందు విపక్ష పార్టీ నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. తాజాగా రాణెబెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కోలివాద్​ నివాసంలో ఆదాయపు పన్నుశాఖ, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

గతంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్​గా పనిచేసిన కోలివాద్​ నివాసంలో... మద్యం, నగదు నిల్వలు ఉన్నాయన్న ఫిర్యాదుపై మంగళవారం రాత్రి ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

"కోలివాద్​ నివాసంలో మద్యం, రూ.10 కోట్లు మేర నగదు ఉన్నట్లు ఫిర్యాదు వచ్చింది. అయితే తనిఖీల్లో మద్యం, నగదు దొరకలేదు." - నాగశయన్​, హవేరీ ఎక్సైజ్​ చీఫ్

రాజకీయ ప్రతీకారచర్య!

ఐటీ దాడులపై కోలివాద్ తీవ్రంగా స్పందించారు.

"భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష నేతలపై రాజకీయ ప్రతీకార చర్యలకు పూనుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పి.చిదంబరం, డీకే శివకుమార్​లు ఈ వేధింపులకు గురయ్యారు. మంగళవారం రాత్రి... అధికారులు నా నివాసంలో తనిఖీలు చేశారు. ఏమీ దొరకక ఉత్తచేతులతో వెళ్లారు." - కోలివాద్​, కాంగ్రెస్ నేత

కార్యకర్తల ఆగ్రహం

కోలివాద్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వాహనాల ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు.

ఇదీ చూడండి:పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం!

Last Updated : Dec 4, 2019, 1:02 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details