తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌరసత్వ బిల్లుపై యూఎస్​సీఐఆర్​ఎఫ్​ వ్యాఖ్యలు సరికావు'

పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికా ఫెడరల్​ కమిషన్​ (యూఎస్​సీఐఆర్​ఎఫ్​) వ్యాఖ్యలను తోసిపుచ్చింది భారత్​. తక్కువ అవగాహన ఉన్న అంశంపై యూఎస్​సీఐఆర్​ఎఫ్ వ్యాఖ్యలు చేయడం తగదని, అందుకు అధికారమే లేదని స్పష్టం చేసింది. పౌరసత్వ బిల్లు, ఎన్​ఆర్​సీతో ఓ ఒక్క భారతీయుడి పౌరసత్వానికి ప్రమాదం లేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.

It has no locus standi: MEA on USCIRF's citizenship bill statement
రవీశ్​ కుమార్​

By

Published : Dec 10, 2019, 6:16 PM IST

పౌరసత్వచట్ట సవరణ బిల్లుపై అమెరికా ఫెడరల్​ కమిషన్​ (యూఎస్​​సీఐఆర్​ఎఫ్​) చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టింది భారత్​. ఈ వ్యాఖ్యలు చేసేందుకు వారికి అధికారం లేదని.. తమకు తక్కువ అవగాహన ఉన్న అంశంపై యూఎస్​సీఐఆర్​ఎఫ్ వ్యాఖ్యలు చేయడం తగదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పష్టం చేశారు​. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్​ఆర్​సీ ప్రక్రియ ఏ భారతీయుడి పౌరసత్వాన్ని తొలగించే ప్రయత్నం చేయదని తెలిపారు.

బిల్లును తప్పుబట్టిన యూఎస్​సీఐఆర్​ఎఫ్​

భారత ప్రభుత్వం ప్రతిపాదించిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా తప్పుబట్టింది అమెరికా ఫెడరల్​ కమిషన్​ (యూఎస్​సీఐఆర్​ఎఫ్​). ఈ బిల్లు ముస్లింలు మినహా ఇతర వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించేందుకు ఓ మార్గం అవుతుందని, మతం ఆధారంగా పౌరసత్వానికి చట్టపరమైన ప్రమాణాన్ని నిర్దేశిస్తుందని యూఎస్‌సీఐఆర్ఎఫ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే షాపై అమెరికా ఆంక్షలు!

ABOUT THE AUTHOR

...view details