తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగులూ.. పాన్‌ లేకపోతే 20% పన్ను! - To this extent the Central Direct Tax Board has issued a circular.

పన్నుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్​ కార్డు గానీ, ఆధార్​ కార్డు గానీ సమర్పించని ఉద్యోగుల నుంచి 20శాతం పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.

It has decided to collect 20 per cent tax on employees who do not submit their PAN or Aadhaar card. To this extent the Central Direct Tax Board has issued a circular.
ఉద్యోగులూ..పాన్‌ లేకపోతే 20% పన్ను..!

By

Published : Jan 24, 2020, 6:28 PM IST

Updated : Feb 18, 2020, 6:36 AM IST

పాన్‌కార్డు గానీ, ఆధార్‌ కార్డుగానీ ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం వరకు లేదా అత్యధిక రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలు ఇచ్చే సమయంలో టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత)చేయాలని ఆదాయపు పన్ను శాఖ అన్ని సంస్థల యాజమాన్యాలకు మరోసారి వెల్లడించింది. ఈ మేరకు గత వారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులు తమ పాన్‌ కార్డు వివరాలను యాజమాన్యాలకు అందజేయాలి. ఒక వేళ ఇవ్వకపోతే 20శాతం మొత్తం కానీ, చట్టంలో వర్తించే రేటు ప్రకారం గానీ ఏది ఎక్కువ అయితే అంత మొత్తాన్ని పన్ను రూపంలో వారి వద్ద నుంచి కత్తిరించాలి. తాజా సంవత్సరం చివరికి రావడంతో ఆయ సంస్థలు లెక్కలు సిద్ధం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రకటన రావడం గమనార్హం.

సాధారణంగా 20శాతం శ్లాబు కంటే తక్కువలోకి వచ్చే ఉద్యోగులు పాన్‌, లేదా ఆధార్‌ నంబర్‌ ఇవ్వకపోతే వారికి జీతంలో 20శాతం వరకు పన్నుకోత విధిస్తారు. అదే 20శాతం శ్లాబు దాటితే ఎంత అయితే అంత కోత విధించడంతోపాటు 4శాతం హెల్త్‌, ఎడ్యూకేషన్‌ సెస్‌ కూడా వసూలు చేస్తారు.

ఈ ఏడాది పన్ను లక్ష్యాలను చేరుకోకపోవడంతో ప్రభుత్వం లోపాలను సరిచేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో సర్క్యూలర్‌ జారీ అయింది. యాజమాన్యాలు ఈ టీడీఎస్‌ నియమాలను పాటించకపోతే వారికి జరిమానాలు విధిస్తామని వెల్లడించింది.

Last Updated : Feb 18, 2020, 6:36 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details