తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాయావతి సోదరుని స్థలం జప్తు.. విలువ రూ.400కోట్లు

బహుజన్ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి కుటుంబసభ్యులపై ఆదాయపన్ను శాఖ కొరడా ఝుళిపించింది. మాయావతి సోదరుడు, అతని భార్యకు చెందిన రూ.400 కోట్ల విలువైన బినామీ భూమిని ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది.

By

Published : Jul 18, 2019, 5:21 PM IST

Updated : Jul 18, 2019, 5:57 PM IST

మాయావతి సోదరుని స్థలం జప్తు.. విలువ రూ.400కోట్లు

బినామీ ఆస్తుల వ్యవహారంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాయావతి సోదరుడు ఆనంద్​ కుమార్​, ఆయన భార్య విచితర్​ లతకు చెందిన రూ.400 కోట్ల విలువైన బినామీ స్థలాన్ని ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక చట్టం కింద ఐటీ శాఖ ఈ భూమిని స్వాధీనం చేసుకుంది.

నోయిడాలో 7 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాట్​ను.. మాయావతి సోదరుడి కుటుంబం బినామీ ఆస్తిగా ఐటీ శాఖ గుర్తించింది. జప్తు కోసం ఈ నెల 16న ఆదేశాలు జారీ చేసింది దిల్లీ ఆధారిత బినామీ నిషేధ విభాగం(బీపీయూ).

ఉత్తర్​ప్రదేశ్​ గౌతమ్​ బుద్ధనగర్​ జిల్లాలోని నోయిడాలో నంబర్​ 2ఏ, సెక్టార్​ 94లో ఈ ప్లాట్​ ఉంది. అందులో విలాసవంతమైన సౌకర్యాలతో ఐదు నక్షత్రాల హోటల్​ నిర్మించాలని యోచించారు.

బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం 1988 సెక్షన్​ 24(3) ప్రకారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆస్తుల్లో కొన్ని నకిలీ సంస్థలతో సహా మొత్తం ఆరు సంస్థలు భాగస్వాములుగా ఉన్నట్లు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. వీటిని బినామీదార్లుగా పేర్కొంది. బినామీ వ్యతిరేక చట్టం కింద వీరిపై కేసు నమోదు చేశారు అధికారులు.

కేంద్ర ప్రభుత్వం 2016లో బినామీ ఆస్తుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం దోషిగా తేలితే సుమారు ఏడేళ్ల జైలు శిక్ష, ఆస్తి.. మార్కెట్​ విలువలో 25 శాతం జరిమానా విధిస్తారు.

ఆనంద్​ కుమార్​ను మాయావతి ఇటీవలే బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా నియమించారు.

ఇదీ చూడండి: జాదవ్​ విడుదలకు నిర్విరామ కృషి: భారత్​

Last Updated : Jul 18, 2019, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details