భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఎర్త్ ఇమేజింగ్, మ్యాపింగ్ ఉపగ్రహం కార్టోశాట్-3ని నవంబర్ 25 న నింగిలోకి పంపనున్నట్లు ప్రకటించింది. ఉదయం 9:28 గంటలకు ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసినట్లు ఇస్రో వెల్లడించింది.
హై రిజల్యూషన్ చిత్రాలు తీసే సామర్థ్యం కలిగిన 'కార్టోశాట్-3'ని... మూడో తరానికి చెందిన అధునాతన ఉపగ్రహంగా అభివర్ణించింది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ వేదికగా నిర్వహించనున్న 74వ ప్రయోగమని తెలిపింది.