తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విక్రమ్​ కనిపించింది.. ఆశలు చిగురించాయి

విక్రమ్​ ల్యాండర్​ను కనుగొన్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో అందరిలో ఆశలు చిగురించాయి. క్లిష్ట పరిస్థితుల్లో ఇస్రోకు అండగా నిలిచిన వారు.. ఇప్పుడు విక్రమ్​ కోసం సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగ సందేశాలు పంచుకుంటున్నారు.

By

Published : Sep 9, 2019, 5:01 AM IST

Updated : Sep 29, 2019, 10:56 PM IST

విక్రమ్​ కనిపించింది.. ఆశలు చిగురించాయి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్న ప్రధాన అంశం.. చంద్రయాన్​-2. విక్రమ్ ల్యాండర్​ను గుర్తించినట్టు ఇస్రో ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. ఇస్రో తదుపరి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో అనేక మంది తమ భావోద్వేగ సందేశాలను పంచుకున్నారు.

దేశభక్తి, ఆశ, ఆత్మగౌరవం వంటి అంశాలతో నెటిజన్లు విశేషంగా ట్వీట్లు చేశారు. దీంతో '#విక్రమ్​ల్యాండర్​ఫౌండ్​' ట్రెండింగ్​గా మారింది.

'#విక్రమ్​ల్యాండర్​ఫౌండ్​'

శనివారం తెల్లవారుజామున చందమామపై అడుగుపెట్టే క్రమంలో ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్​ ల్యాండర్​కు.. ఇస్రో కేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో నిరాశకు గురైన శాస్త్రవేత్తలకు యావత్​ భారతదేశం అండగా నిలిచింది. ఒక రోజు అనంతరం చంద్రుని ఉపరితలంపై ఉన్నవిక్రమ్​ ల్యాండర్​ ఆచూకీతెలిసినట్లు ఇస్రో ఛైర్మన్​ కె. శివన్ తెలిపారు. అయితే తాము ప్రయత్నించినట్టు ల్యాండర్...​ జాబిల్లిపై మృదువుగా దిగి ఉండకపోవచ్చన్నారు.

సామాజిక మాధ్యమాల్లో విక్రమ్​పై చేసిన పోస్టుల్లో.. ఓ నెటిజన్​ ట్వీట్​కు విశేష ఆదరణ లభిస్తోంది.

ఓ నెటిజన్​ ట్వీట్​

"నా చిన్నప్పుడు.. భారత్​ క్రికెట్​ మ్యాచ్​ ఓడిపోతే ప్రజలు బాధపడటం చూశా. ఇప్పుడు విక్రమ్​ ల్యాండర్​ కోసం అనేక మంది కన్నీరు పెట్టుకున్నారు. ఇది సరిపోదా భారత్​ మారుతోందనడానికి? శాస్త్రవేత్తల కోసం భారతదేశ చిన్నారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే.. భారత్​ విజయం సాధిస్తున్నట్టే. జై హింద్​"
-- అయాన్​ భట్టాచర్జీ, నెటిజన్​.

ఇదీ చూడండి:-చంద్రయాన్​-2: ల్యాండర్​ ఆచూకీ లభ్యం.. కానీ...

Last Updated : Sep 29, 2019, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details