తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో 11 రోజుల్లో జాబిల్లిపైకి చంద్రయాన్​-2

భారత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్​ చంద్రయాన్​-2 మరో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. చంద్రుడి మూడవ కక్ష్యలోకి ఈ రోజు ఉదయం చోదక వ్యవస్థ ద్వారా చంద్రయాన్​-2 ప్రవేశించినట్లు ఇస్రో వెల్లడించింది.

By

Published : Aug 28, 2019, 12:36 PM IST

Updated : Sep 28, 2019, 2:20 PM IST

మరో 11 రోజుల్లో జాబిల్లిపైకి చంద్రయాన్​-2

మరో 11 రోజుల్లో జాబిల్లిపైకి చంద్రయాన్​-2

మరో 11 రోజుల్లో చంద్రయాన్​-2 జాబిల్లిపై దిగనుంది. ఈ నేపథ్యంలో మరో కీలక ఘట్టాన్ని విజయవంతంగా అధిగమించింది. చంద్రుడి మూడవ కక్ష్యలోకి ఈ ఉదయం చోదక వ్యవస్థ ద్వారా చంద్రయాన్-2 చంద్రుడి మూడవ కక్ష్యలోకి ప్రవేశించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఉదయం 9.04 నిమిషాలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ 11 వందల 90 సెకన్ల పాటు సాగినట్లు వివరించింది.

ఆగస్టు 21న జాబిల్లి రెండవ కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం చంద్రయాన్ తీసిన రెండు ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. చంద్రుడి ధృవాలను కలుపుతూ ఉండే చివరి కక్ష్యను దాటుకుని జాబిల్లిపై అడుగుపెట్టే లోపు చంద్రయాన్-2 మరో రెండు సార్లు కక్ష్యలను దాటనున్నట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.

సెప్టెంబర్ 2న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి.. 100X30 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అనంతరం సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధృవంపై దిగనుంది. చంద్రయాన్-2 జాబిల్లిపై దిగిన తర్వాత ల్యాండర్ విక్రమ్ నుంచి ప్రగ్యాన్​ రోవర్​ బయటకొచ్చి అక్కడ పరిశోధనలు చేస్తుంది. ఈ రోవర్ విక్రమ్​కు సమాచారం అందిస్తుంది.

Last Updated : Sep 28, 2019, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details