తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్​-2 - కక్ష్య

చంద్రయాన్​-2 ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నేటి ఉదయం 9గంటల 2 నిమిషాలకు చంద్రయాన్-2 జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం చంద్రుడి ధృవాలకు 100 కి.మీల దూరంలోకి వెళ్లడమే లక్ష్యంగా ఆర్బిటర్ ప్రయాణించనుంది.

చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్​-2

By

Published : Aug 20, 2019, 10:02 AM IST

Updated : Sep 27, 2019, 3:10 PM IST

భారత్​.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జాబిల్లి యాత్ర చంద్రయాన్​-2 మరో మైలురాయిని చేరుకుంది. జులై 22న ప్రయోగించిన ఆర్బిటర్​ పలు దశలను దాటి మంగళవారం ఉదయం 9.02 నిమిషాలకు చందమామ కక్ష్యలోకి ప్రవేశించింది. సుమారు 28 నిమిషాల పాటు ఈ ప్రక్రియ సాగింది. అనంతరం రెండు సార్లు జాబిల్లిని చుట్టి.. చంద్రుడి ధృవాలకు 100 కిలో మీటర్ల దూరంలోకి వెళ్లనుంది చంద్రయాన్​-2.

ఇస్రో ప్రకటన

ఈ పూర్తి వ్యవహారంపై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇస్రో ఛైర్మన్​ శివన్​ ప్రకటన చేయనున్నారు.

శివన్​

తర్వాతి దశ ఏంటి?

ఇస్రో ట్వీట్​

విక్రమ్ లాండర్ సెప్టెంబర్ 7న ఆర్బిటర్ నుంచి వేరై చంద్రునిపై ల్యాండవనుంది. జాబిల్లి ఉపరితలంపై లాండర్ సురక్షితంగా దిగే లోపు రెండుసార్లు చంద్రుడి కక్ష్యలో తిరగనుందని స్పష్టం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.

చంద్రయాన్-2 ను జులై 22న జీఎస్​ఎలస్​వీ మార్క్3-ఎం1 వాహకనౌక ద్వారా నింగిలోకి పంపించారు. ఆగస్టు 14న భూకక్ష్య నుంచి వైదొలగి... జాబిల్లి లక్ష్యంగా ప్రయాణించింది. ఈరోజు జాబిల్లి కక్ష్యలోకి చేరింది.

అంతరిక్ష వాహకనౌక స్థితిని ఎప్పటికప్పుడు ఇస్రోలోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు బెంగళూరులోని ట్రాకింగ్ కమాండ్ నెట్​వర్క్ (ఐఎస్​టీఆర్​ఏసీ), ఇండియన్​ డీప్ స్పేస్ నెట్​వర్క్ (ఐడీఎస్​ఎన్) సహకరిస్తున్నాయి. ప్రపంచానికి అవగాహన లేని చంద్రుడిలోని దక్షిణ ధ్రువ ప్రాంతం గురించి చంద్రయాన్-2 పరిశోధన చేయనుందని ఇస్రో వర్గాలు ఇంతకుముందే వెల్లడించాయి.

ఇదీ చూడండి:- చందమామతో ఓ మాట చెప్పాలని...

Last Updated : Sep 27, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details