తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్ సత్తా: జాబిల్లిపై ఇంటి నిర్మాణం చౌకే!

చందమామపై భవనాలు కట్టుకోవాలనుకునే కలను మరింత చౌక ధరకే సాకారం చేసుకోవచ్చు అంటున్నారు భారత శాస్త్రవేత్తలు. యూరియా, గోరుచిక్కుడు జిగురుతో ప్రత్యేక అంతరిక్ష ఇటుకలు తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు. వీటితో, ఇప్పటివరకు చంద్రమండలంపై నిర్మాణాలకు అంచనావేసిన ఖర్చు కన్నా.. దాదాపు 10 రెట్లు తక్కువలోనే కట్టడాలు పూర్తి చేసుకోవచ్చంటున్నారు.

ISRO, IISc created spacebricks with a very low cost to buld lunar houses
భారత్ సత్తా: జాబిల్లిపై ఇంటికి ఖర్చు తక్కువే!

By

Published : Aug 17, 2020, 8:51 AM IST

జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలను మరింత తక్కువ ఖర్చుతో తయారు చేశారు బెంగళూరులోని, ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్), భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) శాస్త్రవేత్తలు. గోరుచిక్కుడు జిగురు, మానవ మూత్రం నుంచి తయారుచేయగల యూరియా, కృత్రిమ చంద్రమండల మట్టితో అద్భుతమే సృష్టించారు.

ఖర్చు తగ్గించేశారు...

ఒక్క పౌండు నిర్మాణ పరికరాలను అంతరిక్షంలోకి పంపించాలంటే దాదాపు రూ.7.5 లక్షలు ఖర్చవుతుంది. మరి, కొన్ని వేల పౌండ్లు పంపించాలంటే.. మాటలా? అందుకే, అతి తక్కువ ఖర్చుతో చంద్రుడిపై నిర్మాణాలు పూర్తి చేసే ఆలోచన చేశారు మన శాస్త్రవేత్తలు. అతి తక్కువ పరికరాలు వినియోగించి ప్రత్యేక అంతరిక్ష ఇటుకలు రూపొందించారు.

భారత్ సత్తా: జాబిల్లిపై ఇంటికి ఖర్చు తక్కువే!

జాబిల్లిపై ఉన్న వనరులతోనే నిర్మాణం జరగాలని ఏడేళ్ల క్రితమే భావించారు ఐఐఎస్ మెకానికల్ ఇంజినీరింగ్​ విభాగం అసిస్టెంట్​ ప్రొఫెసర్ అలోక్​ కుమార్​​. తన బృందంతో కలిసి ఆయన ఆలోచనకు పదును పెట్టారు. చంద్రుడి ఉపరితలంపై లభించే మట్టిని కృత్రిమంగా సృష్టించి దానితో ఆరు నెలల క్రితమే ఇటుకలు తయారు చేశారు. ఇప్పుడు ఆ ఇటుకల తయారీ ఖర్చును కూడా పది రెట్లు తగ్గించేశారు.

ప్రత్యేక పద్ధతిలోనే...

ఈ ఇటుకల తయారీలో స్పోరోసార్సినా పాశ్చూరీ అనే బ్యాక్టీరియాను, కృత్రిమ చంద్రమండల మట్టిలో కలుపుతారు. అందులో గోరుచిక్కుడు జిగురులోని కాల్షియం, యూరియాను కలిపుతారు. వీటిలో రసాయన క్రియ జరిగి అంతరిక్ష ఇటుక ఉత్పత్తి అవుతుందన్నారు అలోక్.

ఈ పద్ధతిని వినియోగించి అంతరిక్షంలోనే ఇటుకలు నిర్మించుకోవచ్చన్నారు అలోక్. ఇందుకోసం భూమి మీది నుంచి అతి తక్కువ పరికరాలు తీసుకెళితే సరిపోతుందన్నారు​. అంతే కాదు, ఈ ఇటుకలను భూమ్మీద కూడా దృఢమైన నిర్మాణాలకు వినియోగించొచ్చు అంటున్నారు.

భారత్ సత్తా: జాబిల్లిపై ఇంటికి ఖర్చు తక్కువే!

చంద్రకంపాన్ని తట్టుకునే ఇటుకలు..

ఈ అంతరిక్ష ఇటుకలను ఇప్పుడు నమూనాలుగా మాత్రమే నిర్మించామని, భారీ అంతరిక్ష ఇటుకలు తయారు చేయడమే తమ తదుపరి లక్ష్యం అంటున్నారు కుమార్. చంద్రకంపాలను సైతం తట్టుకుని నిలబడగల దృఢమైన అంతరిక్ష ఇటుకలు తయారు చేస్తామన్నారు.

ఇదీ చదవండి: భారత్​ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు

ABOUT THE AUTHOR

...view details