తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. డిసెంబరు 11న ముహూర్తం - risat

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్​జర్వే షన్(రిశాట్-2బీఆర్​వన్​) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఈ నెల 11న ముహూర్తం ఖరారు చేసింది. రిశాట్​తో పాటు పలు దేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను సైతం పీఎస్​ఎల్వీ-సీ48 ద్వారా ప్రయోగించనున్నట్లు తెలిపింది.

ISRO gears up for launch of RISAT-2BR1 on December 11
మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. డిసెంబరు 11న ముహూర్తం

By

Published : Dec 4, 2019, 10:33 PM IST

వారం రోజుల క్రితం కార్టోశాట్-3​ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్​జర్వేషన్(రిశాట్-2బీఆర్​వన్​) ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. రిశాట్​తో పాటు అమెరికా, జపాన్​ సహా పలు దేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను సైతం కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ప్రయోగానికి ఈ నెల 11వ తేదీని ఖరారు చేసింది.

ఆంధ్రప్రదేశ్​ శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం-షార్ మొదటి వేదిక నుంచి పీఎస్​ఎల్వీ-సీ48 ద్వారా ఈ ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే డిసెంబర్​ 11న మధ్యాహ్నం 3:25 గంటలకు ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించనుంది.

అమెరికా ఉపగ్రహాలు సైతం

రిశాట్​తో పాటు వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికాకు చెందిన 6 ఉపగ్రహాలు, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్​దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి చేర్చనున్నట్లు ఇస్రో వెల్లడించింది.

క్యూఎల్​(నాలుగు స్ట్రాప్​-ఆన్​ మోటార్లతో కూడిన) విభాగంలోని పీఎస్​ఎల్​వీ ప్రయోగాలలో తాజా ప్రయోగం రెండోదని ఇస్రో తెలిపింది. ఇది షార్​​ వేదికనుంచి చేపడుతున్న 75వ ప్రయోగం కాగా... మొదటి వేదిక నుంచి చేపడుతున్న 37వ ప్రయోగం కావడం గమనార్హం.

ఇదీ చూడండి: స్వామి నిత్యానంద కోసం ప్రత్యేక 'హిందూకైలాస' దేశం..!

ABOUT THE AUTHOR

...view details