తెలంగాణ

telangana

'గగన్​యాన్​ ప్రయోగం కోసం హరిత ఇంధనం అభివృద్ధి'

By

Published : Dec 26, 2020, 7:54 PM IST

త్వరలో చేపట్టబోయే గగన్​యాన్​ మానవ సహిత ప్రయోగం కోసం రాకెట్‌లో వినియోగించేందుకు హరిత ఇంధనాన్ని వినియోగించనుంది ఇస్రో. ఈ మేరకు ఆ ఇంధనాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌.

ISRO developing green propulsion for human space mission: K Sivan
మానవ అంతరిక్షయాత్రలో 'గ్రీన్ ప్రొపల్షన్' ​: ఇస్రో ఛైర్మన్​

2021 డిసెంబర్‌ లోపు చేపట్టాలని భావిస్తున్న మానవ సహిత గగన్‌యాన్‌ ప్రయోగం కోసం రాకెట్‌లో వినియోగించేందుకు హరిత ఇంధనాన్ని అభివృద్ధి చేస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. చెన్నైలోని ఎస్​ఆర్​ఎం శాస్త్ర, సాంకేతిక విద్యాసంస్థ స్నాతకోత్సవంలో పాల్గొన్న శివన్‌ భారత్‌ అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారించాలంటే హరిత సాంకేతికత ద్వారా పర్యావరణ నష్టాన్ని పరిమితం చేసుకోవాలని సూచించారు. అందులో భాగంగానే గగన్‌యాన్‌ మానవ సహిత రాకెట్‌ ప్రయోగంలో ఇస్రో హరిత ఇంధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

రాకెట్‌లోని ప్రతి దశలోనూ ఇలాంటి ఇంధనాన్నే ఉపయోగించే అవకాశం ఉందని వివరించారు. భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని రాకెట్‌ ప్రయోగాల్లోనూ హరిత ఇంధనాన్నే వినియోగించే అవకాశాలు ఉన్నాయని శివన్‌ తెలిపారు.
ఇదీ చూడండి:గగన్​యాన్​పై కరోనా ప్రభావం- ఏడాది వాయిదా

ABOUT THE AUTHOR

...view details