తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విక్రమ్​తో కమ్యూనికేషన్​ పునరుద్ధరించలేకపోయాం' - విక్రమ్​తో కమ్యూనికేషన్​ పునరుద్ధరించలేకపోయాం

చంద్రయాన్​-2 ప్రాజెక్టులో చివరి నిమిషంలో సంబంధాలు తెగిపోయిన ల్యాండర్​తో కమ్యూనికేషన్​ను పునరుద్ధరించలేకపోయామని తెలిపారు ఇస్త్రో ఛైర్మన్​ కె.శివన్​. కానీ ఆర్బిటర్​ చాలా బాగా పనిచేస్తోందని పేర్కొన్నారు. తమ తదుపరి లక్ష్యం గగన్​యాన్​ మిషన్​ కోసం సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

'విక్రమ్​తో కమ్యూనికేషన్​ పునరుద్ధరించలేకపోయాం'

By

Published : Sep 21, 2019, 12:03 PM IST

Updated : Oct 1, 2019, 10:44 AM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్త్రో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చంద్రయాన్​-2లోని విక్రమ్​ ల్యాండర్​, ప్రజ్ఞాన్​ రోవర్​ల కథ సమాప్తమైనట్లు తెలుస్తోంది. ఇస్త్రో ఛైర్మన్​ శివన్​ మాటలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ల్యాండర్​తో కమ్యూనికేషన్​ను పునరుద్ధరించలేకపోయామని తాజాగా వెల్లడించారు శివన్. కానీ ఆర్బిటర్​ చాలా బాగా పనిచేస్తోందని.. ఈ ప్రాజెక్టులో 98 శాతం విజయం సాధించామని భువనేశ్వర్​లో వివరించారు.

ఇస్త్రో ఛైర్మన్​ కె.శివన్

"చంద్రయాన్​-2 ఆర్బిటర్​ చాలా బాగా పనిచేస్తోంది. అందులో 8 శాంకేతిక పరికరాలు ఉన్నాయి. ప్రతి పరికరం అనుకున్నట్లుగానే సక్రమంగా పనిచేస్తోంది. చంద్రయాన్​-2 ఆర్బిటర్​లో మరో ముఖ్య విషయం... దాని జీవిత కాలం. మేము ఒక సంవత్సర కాలం పాటు పనిచేసేలా రూపొందించాం కానీ అది ఏడున్నరేళ్లకు పెరిగింది. ఏడున్నరేళ్లపాటు దాని ద్వారా పరిశోధన జరగనుంది.

ల్యాండర్​తో ఇప్పటి వరకు సమాచారాన్ని పునరుద్ధరించలేకపోయాం. చంద్రయాన్​-2లో రెండు లక్ష్యాలు ఉండటం వల్ల 98 శాతం విజయం సాధించినట్లు చెబుతున్నాం.

గగన్​యాన్​ మిషన్​ అనేది మా ముందున్న తదుపరి ముఖ్యమైన ప్రాజెక్టు. తొలిసారి మానవసహిత మిషన్​ను వచ్చే ఏడాది చివర్లో చేపట్టబోతున్నాం. ఆ ప్రాజెక్టుపైనే పని చేస్తున్నాం."

- కె.శివన్​, ఇస్త్రో ఛైర్మన్​.

నేటితో పగలు పూర్తి

ఈ నెల 7న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగుతూ గల్లంతైన ల్యాండర్​తో కమ్యూనికేషన్​ పునరుద్ధరించేందుకు ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. చంద్రుడిపై ల్యాండర్ 14 రోజుల పాటు పనిచేయాల్సి ఉంది. కానీ అది​ దిగిన ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం నేటితో ముగిసిపోనుంది. అనంతరం రెండు వారాల పాటు సాగే రాత్రి మొదలవుతుంది. నేటి నుంచి అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్​ 200 డిగ్రీలకు చేరుకుంటాయి. ల్యాండర్​, రోవర్​ ఈ చలిని తట్టుకోలేవు.

విక్రమ్​.. చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీ కొట్టినట్లు చంద్రయాన్​-2 ఆర్బిటర్​లోని కెమెరా తీసిన చిత్రాల ఆధారంగా ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.

ఇదీ చూడండి: హనీమూన్ చెడగొట్టినందుకు భారీ జరిమానా!

Last Updated : Oct 1, 2019, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details