తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కీలక ఘట్టం పూర్తి- సెప్టెంబర్​ 7న ల్యాండింగ్​' - చందమామ

చంద్రయాన్​-2కు సంబంధించి మరో కీలక ఘట్టాన్ని సమర్థంగా పూర్తిచేశామని ఇస్రో ఛైర్మన్​ శివన్​ ప్రకటించారు. చంద్రయాన్​-2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిందన్నారు. సెప్టెంబర్​ 7న ల్యాండర్​ చంద్రుడిపై దిగుతుందని, అందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.

'కీలక ఘట్టం పూర్తి- సెప్టెంబర్​ 7న ల్యాండింగ్​'

By

Published : Aug 20, 2019, 2:11 PM IST

Updated : Sep 27, 2019, 3:54 PM IST

చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడం వల్ల చంద్రయాన్​-2​లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైందని ఇస్రో ఛైర్మన్​ శివన్​ తెలిపారు. అత్యంత ముఖ్యమైన ఘట్టాన్ని సమర్థంగా పూర్తిచేశామని హర్షం వ్యక్తం చేశారు.

"చంద్రయాన్​-2 ఈ రోజు ఉదయం 9 గంటలకు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. మొత్తం ప్రక్రియ పూర్తవడానికి 30నిమిషాల సమయం పట్టింది" అని శివన్ వివరించారు.

సెప్టెంబర్​ 2న ఆర్బిటర్​ నుంచి ల్యాండర్​ విడిపోనుందని ఇస్రో ఛైర్మన్​ వెల్లడించారు. అనంతరం సెప్టెంబర్​ 7న చంద్రుడిపై ల్యాండర్​ దిగనుందని పేర్కొన్నారు. ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శివన్​ తెలిపారు.

'కీలక ఘట్టం పూర్తి- సెప్టెంబర్​ 7న ల్యాండింగ్​'

"చంద్రయాన్​-2 మిషన్​కు సెప్టెంబర్​ 7వ తేదీ ఎంతో ముఖ్యమైన రోజు. ఆ రోజు తెల్లవారుజామున ఒంటి గంట 40 నిమిషాలకు ల్యాండర్​ చంద్రుడిపై దిగడం ప్రారంభమవుతుంది. 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ అంతా ముగుస్తుంది. ఇది ఎంతో ముఖ్యం. ఎంతో క్లిష్టమైనది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాం. అంతా సక్రమంగా జరగేందుకు చర్యలు చేపట్టాం. అందరం సెప్టెంబర్​ 7 కోసం ఎదురు చూస్తున్నాం."
-శివన్​, ఇస్రో ఛైర్మన్​.

Last Updated : Sep 27, 2019, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details