భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...జీశాట్-30 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి అరియాన్-5 వాహకనౌక ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లినట్లు ఇస్రో తెలిపింది. కొంత సమయం తర్వాత నౌక నుంచి విడిపోయిన శాటిలైట్.. 38 నిమిషాలకు విజయవంతంగా తన కక్ష్యలోకి ప్రవేశించిందని అధికారులు ట్వీట్ చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ధ్రువీకరిస్తూ... అరియాన్ స్పేస్ సీఈఓ స్టెఫాన్ ఇస్రాల్ కూడా ట్వీట్ చేశారు.
ఇన్‌శాట్-4కు ప్రత్యామ్నాయంగా...
సమాచార శాటిలైట్ అయిన జీశాట్-30 బరువు సుమారు 3,357 కిలోలు. ఇన్‌శాట్-4ఏకు ప్రత్యామ్నాయంగా జీశాట్-30 పనిచేయనుంది.