భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. చంద్రయాన్-2కు చెందిన టీఎంసీ-2 (టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా) చిత్రించిన ఓ బిలానికి చెందిన 3డీ వ్యూను తాజాగా ట్విట్టర్లో పంచుకుంది.
చంద్రయాన్-2: టీఎంసీ-2 చిత్రించిన బిలం 3డీ వ్యూ - చంద్రయాన్-2కు చెందిన టీఎంసీ-2 చిత్రించిన బిలం 3డీ వ్యూ
చంద్రయాన్-2కు చెందిన టీఎంసీ-2 చిత్రించిన ఓ బిలానికి చెందిన 3డీ వ్యూను ఇస్రో విడుదల చేసింది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన చంద్రయాన్-2కు చెందిన విక్రమ్ ల్యాండర్ జాబిలి ఉపరితలంపై ఢీకొన్నది. అయినప్పటికీ ఆర్బిటర్ పనిచేస్తోంది.
జాబిల్లిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనే మూడు కీలక విభాగాల సమ్మేళనం. మెకానికల్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఈ మూడింటినీ శాస్త్రవేత్తలు అనుసంధానించారు. చంద్రుని కక్ష్యలో ఆర్బిటర్ నుంచి విడిపోయి జాబిల్లిపై మృదువుగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. అయితే చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్ సక్రమంగానే పని చేస్తోంది.
ఇదీ చూడండి: 'ఫడణవీస్ సీఎం అని ముందే చెప్పాం.. శివసేనవి కొత్త కోరికలు'