తమ మధ్య ఉన్న వివాదాన్ని ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాలను కోరింది భారత్. శాంతియుతంగా జీవించేందుకు పరస్పర అంగీకారంతో ఓ నిర్ణయానికి రావాలని సూచించింది.వెస్ట్ బ్యాంక్ ఆక్రమించుకున్న భూభాగాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు వేస్తోన్న నేపథ్యంలో.. ఇరు దేశాల వివాదంపై తన వైఖరిని పునరుద్ఘాటించింది భారత్.
వివాదాస్పద భూభాగంలోని 30శాతాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు గత జనవరిలో తెలిపింది ఇజ్రాయెల్. మిగిలిన ప్రాంతంలో పాలస్తీనా ప్రజలకు పరిమిత స్వయంప్రతిపత్తిని ఇవ్వాలని నిర్ణయించింది.