దిల్లీ రిడ్జ్ రోడ్ ప్రాంతంలోని బుద్ధ జయంతి పార్క్ సమీపంలో ఐసిస్‌తో సంబంధం ఉన్న ఓ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి ఐఈడీ వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్ వాటిని నిర్వీర్యం చేసింది.
ఐసిస్ ఉగ్రవాది అరెస్టు.. పేలుడు పదార్థాలు స్వాధీనం - ఐసిస్
ఐసిస్‌కు చెందిన ఉగ్రవాదిని దిల్లీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అతని నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
![ఐసిస్ ఉగ్రవాది అరెస్టు.. పేలుడు పదార్థాలు స్వాధీనం ISIS operative held in Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8512626-thumbnail-3x2-isis.jpg)
దిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్టు
దిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్టు
ద్విచక్రవాహనం మీద వెళ్తున్న ఉగ్రవాదిని ఆపి తనిఖీ నిర్వహించగా.. అతని వద్ద బాంబులను గుర్తించారు పోలీసులు. అతడిని నిలువరించే ప్రయత్నంలో అధికారులపై కాల్పులకు తెగబడ్డాడు ఉగ్రవాది. ధౌలా కువాన్, కరోల్ బాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత శుక్రవారం రాత్రి అతడిని అరెస్ట్ చేశామని ప్రత్యేక బృందం డీసీపీ ప్రమోద్ సింగ్ వెల్లడించారు. పార్క్ పరిసరప్రాంతంలో ముష్కరులు ఎవరైనా ఉన్నారెమోనని జాతీయ భద్రతా దళాలు, దిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Last Updated : Aug 22, 2020, 12:55 PM IST