ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ సద్గురు జగ్గీ వాసుదేవ్.. 'భైరవ' పేరుతో వేసిన పెయింటింగ్ వేలంలో కోట్లు పలికింది. నెల రోజుల క్రితం ఆన్లైన్ వేలంలో ఉంచగా.. సోమవారంతో ఆ ప్రక్రియ ముగిసింది. ఈ పెయింటింగ్‌కు రూ. 5.1 కోట్ల రూపాయలు పలికినట్లు తెలిపింది సంస్థ. ఈ నగదు మొత్తం ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలోని కొవిడ్-19 రిలీఫ్ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది.
" ఈశా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు అందించిన సద్గురు కళాకృతుల్లో ఇది రెండోది. సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా పోరులో ముందుండి పోరాడుతోన్న ఆరోగ్య సిబ్బందికి వ్యక్తిగత భద్రతా కిట్లు, ఐసోలేషన్ వార్డుల్లో మౌలిక వసతుల కల్పన, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహారం, రోగనిరోధక శక్తి పెంచే పానీయాలను అందిస్తోంది."