తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యాహక్కు చట్టాన్ని విస్తరించకుండా సార్వత్రిక విద్య అందేదెలా? - Is universal education possible without extending the law to the right to education?

విద్యాహక్కు చట్టాన్ని విస్తరించకుండా సార్వత్రిక విద్య అందేదెలా? అని నూతన విద్యా విధానంపై ప్రశ్నించింది రైట్​ టు ఎడ్యుకేషన్​ ఫోరం. కొత్త విధానంపై కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది.

right to education
విద్యాహక్కు చట్టాన్ని విస్తరించకుండా సార్వత్రిక విద్య అందేదెలా?

By

Published : Jul 31, 2020, 5:35 AM IST

కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన నూతన విద్యా విధానంపై 'రైట్‌ టు ఎడ్యుకేషన్‌ ఫోరం' ప్రశ్నలు సంధించింది. విద్యాహక్కు చట్టాన్ని విస్తరించకుండా పాఠశాల విద్యను సార్వత్రికం చేస్తామని ప్రకటించడం విస్మయం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.

" 3-18 ఏళ్ల వయస్సు వారందరికీ పాఠశాల విద్యను అందుబాటులోకి తేవాలని నిర్ణయించడం మంచిదే. ఈ నిబంధన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కానప్పుడు సార్వత్రిక విద్య అమలు సాధ్యం కాదు. ‘విద్యా హక్కు చట్టం-2009’ విస్తరించడం గురించి నూతన విధానంలో ఎక్కడా చెప్పలేదు. కస్తూరి రంగన్‌ కమిటీ సమర్పించిన ముసాయిదాలో ప్రాథమిక, మాధ్యమిక విద్యను విద్యాహక్కు చట్టం పరిధిలోకి తేవాలని సిఫార్సు చేయడాన్ని పౌరసమాజం స్వాగతించింది. అయితే తుది ముసాయిదాలో అది కనిపించకపోవడం నిరుత్సాహ పరిచింది. విద్యాహక్కు చట్టాన్ని విస్తరించకుండా సార్వత్రిక విద్య సాధ్యం కాదు"

- రైట్​ టు ఎడ్యుకేషన్​ ఫోరం

వృత్తి విద్యలో శిక్షణ, డిజిటల్‌ విద్య ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పాఠశాలల విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయంది.

ఇదీ చూడండి: 5వ తరగతి వరకు అమ్మభాషలోనే..

ABOUT THE AUTHOR

...view details