తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తలాక్​ బిల్లు రాజ్యసభ గడప దాటేనా? - ముమ్మారు

ముమ్మారు తలాక్​ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు. కాంగ్రెస్​, జేడీయూ, అన్నాడీఎంకే, డీఎంకే, వైకాపా, ఆర్​ఎల్​డీ, తృణమూల్​ కాంగ్రెస్​ సహా పలు పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాయి.

తలాక్​ బిల్లు రాజ్యసభ గడప దాటేనా?

By

Published : Jul 30, 2019, 3:50 PM IST

ముమ్మారు తలాక్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ బిల్లును సభ ముందుంచారు. బిల్లుపై చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగు గంటల పాటు సాగనుంది.

బిల్లుకు తాము అనుకూలం కాదని కాంగ్రెస్​, జేడీయూ, అన్నాడీఎంకే, డీఎంకే, వైకాపా, ఆర్​ఎల్​డీ, తృణమూల్​ కాంగ్రెస్​ సహా పలు పార్టీలు ప్రకటించాయి. బిల్లులోని క్రిమినల్​ కోణాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మహిళల సమస్యలపై మెజిస్ట్రేట్​ కోర్టులో విచారణ సరికాదని.. కుటుంబ కోర్టులోనే విచారణ జరగాలని విపక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు.

తలాక్​ చెబితే భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు విపక్ష సభ్యులు. బిల్లును వ్యతిరేకిస్తూ ఓటింగ్​ సమయంలో వాకౌట్​ చేస్తామని అన్నాడీఎంకే తెలిపింది. జేడీయూ సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలిపి సభ నుంచి నిష్క్రమించారు.

ఈ బిల్లును రాజకీయ కోణంలో చూడరాదని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సూచించారు. ఆమోదానికి సహకరించాలని కోరారు.

తలాక్​ బిల్లు గురించి మాట్లాడుతున్న న్యాయశాఖ మంత్రి

"ముమ్మారు తలాక్ బిల్లు అంశాన్ని రాజకీయ కోణంలో, ఓటు బ్యాంకు కోసం చూడొద్దు. ఇది మానవత్వంతో చూడాల్సిన అంశం. మహిళల న్యాయం, గౌరవం, వారి ఎదుగుదలకు సంబంధించిన అంశం. ఓ వైపు మన అమ్మాయిలు కుస్తీ ఒలింపిక్స్​లో బంగారు పతకాలు గెలుస్తున్నారు, వైమానిక దళంలో యుద్ధ విమానాలు నడుపుతున్నారు, చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ ప్రాజక్టుల్లో శాస్త్రవేత్తలుగా పని చేస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ముందుకు వెళుతున్నారు. కానీ మరోవైపు ముమ్మారు తలాక్‌ ద్వారా మహిళలను ఫుట్‌పాత్‌పై ఉంచడం న్యాయం కాదు. "
- రవిశంకర్​ ప్రసాద్​, న్యాయశాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details