వలస కార్మికులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం దిల్లీలో సమావేశమైన తీరును 'డ్రామా'గా అభివర్ణించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
వలస కూలీల పిల్లలు, సామగ్రిని ఎత్తుకుని రాహుల్ వాళ్లతో కలిసి నడిచి ఉంటే బాగుండేది. రోజూ కేంద్రం చేసే పనుల్ని కాంగ్రెస్ 'డ్రామా' అని పిలుస్తుంది. మరి నిన్న కాంగ్రెస్ చేసిందేమిటి? రోడ్ల వెంట నడిచి వెళ్తున్న వలస కార్మికులతో కూర్చొని మాట్లాడేందుకు నిన్ననే సరైన సమయమా? ఇది డ్రామా కాదా?