తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2020, 5:28 AM IST

ETV Bharat / bharat

విద్యార్థులకు 10జీబీ డేటా.. నిజమేనా?

విద్యార్థులకు ప్రభుత్వం 10 జీబీ ఇంటర్నెట్‌ డేటాను అందించనుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలు నిజం కాదని కేంద్ర ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో స్పష్టం చేసింది.

Is Government Providing 10GB free data to students
విద్యార్థులకు 10జీబీ డేటా.. నిజమేనా?

దేశంలోని విద్యార్ధులందరికీ ప్రభుత్వం 10 జీబీ ఇంటర్నెట్‌ డేటాను అందించనుందనే వార్తలు వాట్సప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా పాఠశాలలు, కళాశాలలు తదితర విద్యా సంస్థల్లో కొనసాగుతున్న ఆన్‌లైన్‌ తరగతులు, పరీక్షల్లో విద్యార్థులు పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టనుందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్తలు నిజం కాదని కేంద్ర ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో స్పష్టం చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రభుత్వం ఆ విధమైన నిర్ణయమేదీ తీసుకోలేదని ఈ సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'దేశీయ రక్షణ సామర్థ్యంతోనే శాంతికి పునాది'

ABOUT THE AUTHOR

...view details