తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఖండాలు చుట్టేసి... పర్వతాలన్నీ ఎక్కేసి

భారత ఐపీఎస్​ అధికారిణి అపర్ణ కుమార్ దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేశారు. ప్రపంచంలోని దాదాపు అన్ని ఎత్తయిన పర్వతాలను అధిరోహించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

ఖండాలు చుట్టేసి

By

Published : Mar 10, 2019, 8:49 AM IST

ఐపీఎస్​ అధికారి కావాలంటే కఠోర శ్రమ, అంకిత భావం అవసరం. ఇదే స్ఫూర్తిని ఉద్యోగంలో చేరిన తర్వాతా కొనసాగిస్తున్నారు ఐపీఎస్ అధికారిణి అపర్ణ కుమార్​. ఎత్తయిన పర్వతాలను అధిరోహించటమంటే ఆమెకు మహా ఇష్టం. దీనికోసం కోసం ఏకంగా ప్రపంచాన్నే చుట్టేశారు. దాదాపు అన్ని ఎత్తయిన పర్వతాలను అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. దృఢమైన సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు అపర్ణ.
ఆఫ్రికాలో ఎత్తయిన 'కిలిమంజారో' పర్వతాన్ని 2014 మే లో అధిరోహించారు అపర్ణ. అదే ఏడాది నవంబర్​లో ఇండోనేసియాలోని 'కార్​స్టెంజ్ పిరమిడ్'​నూ ఆరోహించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాదీ పర్వతాలను అధిరోహిస్తూనే ఉన్నారు.

అపర్ణ అధిరోహించిన పర్వతాలు

⦁ 2014 'మే'లో ఆఫ్రికాలోని కిలిమంజారో.. నవంబర్​లో ఇండోనేసియాలోని కార్ట్సెంజ్​ పిరమిడ్​.

అపర్ణ కుమార్ 1

⦁ 2015 జనవరిలో అర్జెంటీనాలో అకొంకాగ్వా, ఆగస్టులో రష్యాలోని ఎల్బ్రుజ్ పర్వతాలు.

అపర్ణ కుమార్ 2

⦁ 2016 జనవరిలో అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్,' మే' లో ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ

అపర్ణ కుమార్ 3

⦁ 2017 సెప్టెంబర్​లో హిమాలయాల్లోని మౌంట్ మనాస్లు పర్వతం.

అపర్ణ కుమార్ 4

అపర్ణ కుమార్​ 2002 బ్యాచ్​కు చెందిన ఐపీఎస్ అధికారిణి. ప్రస్తుతం ఉత్తరాఖండ్​ రాజధాని దెహ్రాదూన్​లో ఇండో-టిబెటన్ సరిహద్దు దళం పోలీసు డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు.

అపర్ణ కుమార్​ స్వగ్రామం కర్ణాటకలోని శివమొగ్గ. బెంగళూరు నేషనల్​ కాలేజ్​ నుంచి బీఏలో డిగ్రీ పట్టా పొందారు. నేషనల్ లా స్కూల్​లో ఎల్​ఎల్​బీ పూర్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details