తమ కన్నబిడ్డల్ని చూడటం కోసం ఓ పోలీసు ఉన్నతాధికారి అర్థరాత్రి రోడ్డుపై నిరసనకు దిగిన ఆసక్తికర ఘటన ఇది. అయితే చిన్నారులను కలవడానికి నిరాకరించిన ఆ మాజీ భార్య కూడా ఐపీఎస్ అధికారిణే కావడం గమనార్హం.
ఐపీఎస్ అధికారి అరుణ్ రంగరాజన్ ప్రస్తుతం బెంగళూరులోని కాలబురగిలోని పోలీస్ అంతర్గత భద్రతా విభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్‌పీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మాజీ భార్య కూడా డీసీపీ స్థాయి అధికారిణిగా పనిచేస్తోంది. వీరిద్దరు ఛత్తీస్‌ఘడ్‌లో పనిచేస్తున్న సమయంలో వివాహం చేసుకున్నారు. అక్కడ ఉంటున్న సమయంలోనే వీరికి తొలిసంతానం కలిగింది. ఆ సమయంలోనే ఉద్యోగంలో తరచూ బదిలీలు అవుతుండటం వల్ల భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వీరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రయత్నంలో ఉండగానే సదరు అధికారిణి మరోబిడ్డకు జన్మనిచ్చారు. ఇద్దరు పిల్లలున్న ఈ జంటకు 2015లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
పిల్లల్ని చూసేంత వరకు కదిలేదిలేదు...